Amazon Fire సిరీస్ నుంచి సరికొత్త టాబ్లెట్‌లు, Alexa వాయిస్ అసిస్టెంట్ సపోర్టుతో లభ్యం

Amazon Fire సిరీస్ నుంచి సరికొత్త టాబ్లెట్‌లు
Amazon Fire సిరీస్ నుంచి సరికొత్త టాబ్లెట్‌లు, Alexa వాయిస్ అసిస్టెంట్ సపోర్టుతో లభ్యం

ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ (Amazon), తన అమెజాన్ ఫైర్(Amazon Fire) సిరీస్ నుంచి సరికొత్త టాబ్లెట్‌లను మార్కెట్లో లాంచ్ చేసింది. ఫైర్ హెచ్‌డి 8 (Fire HD 8),  ఫైర్ హెచ్‌డి 8 కిడ్స్(Fire HD 8 Kids) పేర్లతో ఈ టాబ్లెట్స్ అందుబాటులో ఉంటాయి. వీటిలో మొదటి మోడల్ ధర 79.99 డాలర్లు (ఇండియన్ కరెన్సీలో ఈ విలువ రూ.5,767), రెండ మోడల్ ధర 129.99 డాలర్లు (ఇండియన్ కరెన్సీలో ఈ విలువ రూ.9,372). వీటిలో ఫైర్ హెచ్‌డి 8 మోడల్ ఇప్పటికే అమెజాన్.కామ్‌లో ట్రేడ్ అవుతుంది. మరో మోడల్ అయిన ఫైర్ హెచ్‌డి 8 ప్లస్ అక్టోబర్ 4 నుంచి మార్కెట్లో లభ్యమవుతుంది.

Also Read : Moto G5 యూజర్లకు గుడ్‌ న్యూస్, త్వరలోనే ఆండ్రాయిడ్ ఓరియో 8.1 సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌

అమెజాన్ ఫైర్ హెచ్‌డి 8 (Amazon Fire HD 8) స్పెసిఫికేషన్స్.. 8 అంగుళాల హైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ కెపాసిటీ వచ్చేసరికి 1280 x 800 పిక్సల్స్), అలెక్సా వాయిస్ అసిస్టెంట్ ఇంటిగ్రేషన్, 1.3గిగాహెట్జ్ క్వాడ్-కోర్ ప్రాసెసర్, 1.5జీబి ర్యామ్, స్టోరేజ్ వేరియంట్స్ (16జీబి, 32జీబి), మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 400జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 2 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 720 పిక్సల్ హెచ్‌డి ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, డ్యుయల్ స్టీరియో స్పీకర్స్.

Also Read : Reliance ఆఫర్, డైరీ మిల్క్ చాక్లెట్ కొంటే ఒక జీబి Jio 4జీ డేటా ఉచితం

అమెజాన్ ఫైర్ హెచ్‌డి 8 కిడ్స్ ఎడిషన్ (Amazon Fire HD 8 Kids Edition) స్పెసిఫికేషన్స్..  8 అంగుళాల హైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ కెపాసిటీ వచ్చేసరికి 1280 x 800 పిక్సల్స్) విత్ కిడ్ ప్రూఫ్ చేస్, అలెక్సా వాయిస్ అసిస్టెంట్ ఇంటిగ్రేషన్, 1.3గిగాహెట్జ్ క్వాడ్-కోర్ ప్రాసెసర్, 1.5జీబి ర్యామ్, 32 ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 400జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 2 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 720 పిక్సల్ హెచ్‌డి ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, డ్యుయల్ స్టీరియో స్పీకర్స్, వన్ ఇయర్ అమెజాన్ ఫ్రీటైమ్ అన్‌లిమిటెడ్ సర్వీస్, ఇన్‌బిల్ట్ ఎడ్యుకేషనల్ గేమ్స్ ఇంకా యాప్స్, పేరెంటల్ కంట్రోల్ సపోర్ట్.

Also Read : Portronics నుంచి సరికొత్త వైర్‌లెస్ బ్లుటూత్ స్పీకర్‌ Vibe, ధర రూ.2,499

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.