Xiaomi నుంచి 12.5 ఇంచ్ ల్యాప్‌టాప్, Mi Notebook Air

Mi Notebook Air
Xiaomi నుంచి 12.5 ఇంచ్ ల్యాప్‌టాప్, Mi Notebook Air

ఈ ఏడాది ఆరంభంలో 13.3 ఇంచ్ ఎంఐ నోట్‌బుక్ ఎయిర్‌ (Mi Notebook Air)ను ప్రపంచానికి పరిచయం చేసిన షావోమి ఇప్పుడు ఇదే మోడల్‌కు సంబంధించి 12.5 ఇంచ్ వేరియంట్‌ను చైనా మార్కెట్లో లాంచ్ చేసింది. ఖరీదు 999 యువాన్‌లు.

ఇండియన్ కరెన్సీలో ఈ విలువ ఇంచుమించుగా రూ.40,000. Mi.com, JD.comలలో ప్రీ-ఆర్డర్ పై ఈ ల్యాపీ లభ్యమవుతోంది. సిల్వర్ కలర్ వేరియంట్‌లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఇండియన్ మార్కెట్లో ఈ డివైస్ అందుబాటుకు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడికావల్సి ఉంది.

ఎంఐ నోట్‌బుక్ ఎయిర్ (12.5 ఇంచ్) ఫీచర్స్ ఇంకా స్పెసిఫికేషన్స్..

Xiaomi నుంచి 12.5 ఇంచ్ ల్యాప్‌టాప్, Mi Notebook Air
Mi Notebook Air

12 ఇంచ్ ఫుల్ హైడెఫినిషన్ డిస్‌ప్లే (స్ర్కీన్ రిసల్యూషన్ వచ్చేసరికి 920 x 1080 పిక్సల్స్, 170 డిగ్రీ వైడ్ వ్యూవింగ్ యాంగిల్, 300nits బ్రైట్నెస్, 600:1 కాంట్రాస్ట్ రేషియో, 16:9 వైడ్ స్ర్కీన్ రేషియో), విండోస్ 10 హోమ్ ఎడిషన్ ఆపరేటింగ్ సిస్టం, 7th Gen ఇంటెల్ కోర్ ఐ5-7వై54 (Core i5-7Y54) ప్రాసెసర్ విత్ ఇంటెల్ హెచ్‌డి గ్రాఫిక్స్ 615, 4జీబి ర్యామ్ 256జీబి ఎస్ఎస్‌డి స్టోరేజ్, 1 మెగా పిక్సల్ వెబ్ కెమెరా,

ఈ నోట్ బుక్ లో నిక్షిప్తం చేసిన బ్యాటరీ వ్యవస్థ 1సీ ఫాస్ట్ ఛార్జ్‌ను సపోర్ట్ చేస్తుంది. సింగిల్ ఛార్జ్ పై  8 గంటల ఆన్‌లైన్ వీడియో ప్లేబ్యాక్, 7.5 గంటల లోకల్ వీడియో ప్లేబ్యాక్, 7.5 గంటల వెబ్ బ్రౌజింగ్‌ను ఆస్వాదించవచ్చని కంపెనీ చెబుతోంది.

ఇక  కనెక్టువిటీ విషయానికి వచ్చేసరికి యూఎస్బీ టైప్-సీ, యూఎస్బీ 3.0, హెచ్‌డిఎమ్ఐ, 3.5ఎమ్ఎమ్ ఆడియో జాక్ వంటి స్టాండర్డ్ ఫీచర్స్ ఈ ల్యాపీలో ఉన్నాయి.  బ్యాక్‌లైట్ కీబోర్డ్, గ్లాస్ ట్రాక్‌ప్యాడ్ వంటి ప్రత్యేకతలతో వస్తోన్న ఈ నోట్‌బుక్ బరువు 1.07 కిలో గ్రాములుగా ఉంటుంది. చుట్టుకొలత 292x202x12.9 మిల్లీ మీటర్లు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.