లెనోవో ThinkPad సిరీస్ నుంచి అతి నాజూకైన ల్యాప్‌టాప్‌ మార్కెట్లో రిలీజ్ అయ్యింది..

లెనోవో ThinkPad సిరీస్ నుంచి రెండు శక్తివంతమైన ల్యాప్‌టాప్‌లు మార్కెట్లో లాంచ్ అయ్యాయి.

లెనోవో తన థింక్‌ప్యాడ్ (ThinkPad) సిరీస్ నుంచి రెండు శక్తివంతమైన ల్యాప్‌టాప్‌లను అంతర్జాతీయ మార్కెట్లో లాంచ్ చేసింది. థింక్‌ప్యాడ్ పీ1 (ThinkPad p1), థింక్‌ప్యాడ్ పీ72 (ThinkPad p72) మోడల్స్‌లో ఈ ల్యాపీలు అందుబాటులో ఉంటాయి. ఆగష్టు చివరి నుంచి ఇవి మార్కెట్లో లభ్యమయ్యే అవకాశముంది. వీటిలో లెనోవో పీ1 వర్క్‌స్టేషన్‌ను థింక్‌ప్యాడ్ సిరీస్ నుంచి ఇప్పటి వరకు లాంచ్ అయిన అతి నాజూకైనా ఇంకా తేలికైన ల్యాప్‌టాప్‌గా లెనోవో అభివర్ణిస్తోంది. ఈ రెండు ల్యాప్‌టాప్స్ 8వ తరం ఇంటెల్ Xeon ప్రాసెసర్స్ పై రన్ అవుతాయి.

థింక్‌ప్యాడ్ పీ1 స్పెసిఫికేషన్స్.. బ్లాక్ కార్బన్ ఫైబర్ ఫినిషింగ్‌, 15.6 అంగుళాల టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే విత్ 4కే యూహెచ్‌డి (3840 x 2160) రిసల్యూషన్ స్ర్కీన్, విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టం, ఇంటెల్ 8వ తరం Xeon E-2176M సిక్స్ కోర్ ప్రాసెసర్, ఎన్‌విడియా క్వాడ్రో పీ2000 గ్రాఫిక్ కార్డ్, 64జీబి డీడీఆర్4 మెమురీ, 4టీబి స్టోరేజ్‌, 13 గంటల బ్యాటరీ బ్యాకప్, బ్లుటూత్ 5.0 కనెక్టువిటీ, థండర్ బోల్ట్ పోర్ట్స్‌, యూఎస్బీ 3.1 ఇంకా హెచ్‌డిఎమ్ఐ సపోర్ట్. అంతర్జాతీయ మార్కెట్లో  థింక్‌ప్యాడ్ పీ1 ల్యాపీ ధర 1,949 డాలర్లుగా ఉంది. మన కరెన్సీలో ఈ విలువ షుమారుగా రూ.1,35,000గా ఉంటుంది.

థింక్‌ప్యాడ్ పీ72 స్పెసిఫికేషన్స్ .. 17.3 అంగుళాల టచ్ స్ర్కీన్ డిస్‌ప్లే విత్ 4కే యూహెచ్‌డి (3840 x 2160) రిసల్యూషన్ స్ర్కీన్, విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టం, ఇంటెల్ 8వ తరం Xeon E-2176M సిక్స్ కోర్ ప్రాసెసర్, ఎన్‌విడియా క్వాడ్రో పీ5200 16జీబి గ్రాఫిక్ కార్డు, 128జీబి డీడీఆర్4 మెమురీ, 6టీబి ఇంటర్నల్ స్టోరేజ్‌, ఫింగర్ ప్రింట్ రీడర్, ఫేస్ రికగ్నిషన్, విండోస్ హల్లో,  బ్లుటూత్ 5.0 కనెక్టువిటీ, థండర్ బోల్ట్ పోర్ట్స్‌, యూఎస్బీ 3.1 ఇంకా హెచ్‌డిఎమ్ఐ సపోర్ట్, అంతర్జాతీయ మార్కెట్లో  థింక్‌ప్యాడ్ పీ1 ల్యాపీ ధర 1,799 డాలర్లుగా ఉంది. మన కరెన్సీలో ఈ విలువ షుమారుగా రూ.1,26,000గా ఉంటుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.