HP నుంచి సరికొత్త మినీ డెస్క్‌టాప్ పీసీ, ధర రూ.19,990

HP 260 G3 Desktop Mini
HP నుంచి సరికొత్త మినీ డెస్క్‌టాప్ పీసీ, ధర రూ.రూ.19,990

ప్రముఖ కంప్యూటింగ్ ఉత్పత్తుల తయారీ కంపెనీ హెచ్‌పీ (HP), హెచ్‌పీ 260 జీ3 (HP 260 G3) పేరుతో సరికొత్త  డెస్క్‌టాప్ మినీ పీసీని ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేసింది. ప్రారంభ వేరియంట్ ధర రూ.19,990. హై-ఎండ్ వేరియంట్ ధర రూ.25,990. ఇండియన్ ఎడ్యుకేషన్ ఇకోసిస్టమ్‌ను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేకంగా డిజైన్ చేయబడిన ఈ పోర్టబుల్ కంప్యూటర్‌ను తక్కువ డెస్క్ స్పేస్‌లో కూడా ఉపయోగించుకునే వీలుంటుందని హెచ్‌పీ ఇండియా వెల్లడించింది.

Also Read : జియోకు పోటీగా Airtel కొత్త ప్రీపెయిడ్ ప్లాన్..

ఈ మినీ డెస్క్‌టాప్ పీసీకి సంబంధించిన బేస్ వేరియంట్ ఇంటెల్ పెంటియమ్ డ్యుయల్ కోర్ ప్రాసెసర్ పై రన్ అవుతుంది. మీ అవసరాన్ని 7th జనరేషన్ ఇంటెల్ కోర్ ఐ3 వరకు ప్రాసెసర్ అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు. ఇదే సమయంలో ర్యామ్ కెపాసిటీ 32జీబి సామర్థ్యంతో కూడిన డీడీఆర్4 వరకు పొడిగించుకోవచ్చు. ఈ డెస్క్‌టాప్ మినీ పీసీని హెచ్‌పీ ఇంటిగ్రేటెడ్ వర్క్ సెంటర్ అలానే హెచ్‌పీ ఎలైట్ డిస్‌ప్లేలకు పెయిర్ చేసుకోవటం ద్వారా రీడింగ్స్ దగ్గర నుంచి ప్రెజంటేషన్స్ వరకు మరింత అర్థవంతంగా ఉంటాయని హెచ్‌పీ ఇండియా తెలిపింది.

Also Read : 8జీబి ర్యామ్, 512జీబి ఇంటర్నల్ స్టోరేజ్ సపోర్టుతో Razer Phone 2

ఇక కనెక్టువిటీ ఫీచర్స్ విషయానికి వచ్చేసరికి హెచ్‌పీ 260 జీ3 డెస్క్‌టాప్ మినీ పీసీని VGA, USB ఇంకా HDMI పోర్ట్స్ ద్వారా వివిధ యాక్సెసరీస్ ఇంకా మానిటర్స్‌కు పెయిర్ చేసకునే వీలుంటుంది. పీసీ వెనుక భాగంలో ఏర్పాటుచేసిన రేర్ తంబ్ స్ర్కూ ద్వారా యూనిట్‌ను సులువుగా ఓపెన్ చేసుకుని పాడైపోయిన కాంపోనెంట్‌లను సులువుగా రీప్లేస్ చేసుకునే అవకాశాన్ని హెచ్‌పీ కల్పిస్తోంది.

Also Read : ఆపిల్ కొత్త ఐఫోన్‌లను Airtel Online Store నుంచి సొంతం చేసుకోవచ్చు..

Dual VESA Sleeve ద్వారా ఈ డెస్క్‌టాప్ మినీ పీసీని మానిటర్ క్రింద మౌంట్ చేసకునే వీలుంటుంది. దీంతో  డెస్క్ స్పేస్‌ అనేది మరింతగా తగ్గిపోతుంది. విండోస్ 10 ప్రో ఆపరేటింగ్ సిస్టం పై  పీసీ రన్ అవుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.