Apple MacBook Air 2018 ఇండియా ధర ఎంతంటే..?

MacBook Air
Apple MacBook Air 2018 ఇండియా ధర ఎంతంటే..?

మ్యాక్‌బుక్ ఎయిర్ (MacBook Air) ఇంకా ఐప్యాడ్ ప్రో (iPad Pro)లకు సంబంధించిన 2018 ఎడిషన్స్‌ను ఆపిల్ (Apple) సంస్థ రెండు రోజుల క్రితమే అంతర్జాతీయ మార్కెట్లో అనౌన్స్ చేసింది. తాజాగా వీటికి సంబంధించిన ఇండియా ధరలను సంస్థ రివీల్ చేసింది. వీటిలో ఐప్యాడ్ ప్రో ప్రారంభ  వేరియంట్ ధర భారత్‌లో రూ.71,900 నుంచి ప్రారంభమవుతుంది. మరో మోడల్ అయిన మ్యాక్‌బుక్ ఎయిర్ రూ.1,14,900 నుంచి అందుబాటులో ఉంటుంది.

మ్యాక్‌బుక్ ఎయిర్ (MacBook Air) 2018 ప్రత్యేకతలు..

మ్యాక్‌బుక్ ఎయిర్ (2018 మోడల్) 13.3 ఇంచ్ ఎడ్జ్-టు-ఎడ్జ్ రెటీనా డిస్‌ప్లేతో వస్తోంది. ఏకంగా 40 లక్షల పిక్సల్స్‌తో ఎక్విప్ అయి ఉన్న ఈ డిస్‌ప్లే మునుపటి మోడల్‌తో పోలిస్తే మరింత క్వాలిటీని ప్రొవైడ్ చేస్తుంది. ఈ కొత్త నోట్ బుక్‌లో ఎక్విప్ చేసిన ఆపిల్ టచ్ ఐడీ, టీ2 చిప్ ఆధారంగా స్పందిస్తుంది. ఈ చిప్‌ను గతఏడాది లాంచ్ చేసిన మ్యాక్‌బుక్ ప్రో ద్వారా యాపిల్ ప్రపంచానికి పరిచయం చేసింది. డివైస్‌లో పొందుపరిచిన 8వ తరం ఇంటెల్ డ్యుయల్ కోర్ ప్రాసెసర్ ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్ సపోర్టుతో అత్యుత్తమ ప్రాసెసింగ్‌ను ఆఫర్ చేస్తుందట.

Also Read : OnePlus 6T లాంచ్ అయ్యింది, స్పెక్స్ ఇవే!

ర్యామ్ ఇంకా స్టోరేజ్ విషయానికి వచ్చేసరికి ఈ కొత్త నోట్‌బుక్‌లో 16జీబి వరకు ర్యామ్‌తో పాటు 1.5 టెరా బైట్స్ వరకు ఎస్ఎస్‌డి స్టోరేజ్‌ను యాపిల్ ప్రొవైడ్ చేస్తోంది. కనెక్టువిటీ ఫీచర్స్ విషయానికి వచ్చేసరికి ఈ డివైస్‌లో రెండు యూఎస్బీ టైప్-సీ పోర్ట్స్‌తో పాటు 3.5ఎమ్ఎమ్ హెడ్‌ఫోన్ జాక్, థర్డ్ జనరేషన్ బటర్‌ఫ్లై కీబోర్డ్‌లు ఎక్విప్ అయి ఉన్నాయి. ఈ మ్యాక్‌బుక్‌లో ఎక్విప్ చేసిన బ్యాటరీ సింగిల్ ఛార్జ్ పై 13 గంటల బ్యాటరీ బ్యాకప్‌ను ప్రొవైడ్ చేయగలుగుతుందట. నవంబర్ 7 నుంచి ఈ డివైస్ ఇండియన్ స్టోర్‌లలో  అందుబాటులో ఉంటుంది. 128జీబి వేరియంట్ ధర రూ.1,14,990, 256జీబి స్టోరేజ్ వేరియంట్ ధర రూ.1,34,900. స్పేస్ గ్రే, గోల్డ్ ఇంకా సిల్వర్ కలర్ వేరియంట్ లలో మ్యాక్‌బుక్ ఎయిర్ (2018 మోడల్)ను సొంతం చేసుకోవచ్చు.

ఐప్యాడ్ ప్రో (iPad Pro) 2018

ఐప్యాడ్ ప్రో (iPad Pro) 2018 మోడల్ మొత్తం రెండు స్ర్కీన్ సైజుల్లో అందుబాటులో ఉంటుంది. అందులో మొదటి సైజ్ వచ్చేసరికి 11 అంగుళాలతోనూ, రెండవ సైజ్ వచ్చేసరికి 12.9 అంగుళాల సైజుతోనూ అందుబాటులో ఉంటుంది. ఈ రెండు వేరియంట్‌లలో హోమ్ బటన్ ఉండదు. బీజిల్స్ చాలా చిన్నవిగా ఉంటాయి. ఈ టాబ్లెట్ తరహా డివైస్‌కు లిక్విడ్ రెటీనా డిస్‌ప్లే మరో ప్రధానమైన హైలైట్‌గా నిలుస్తుంది.

Also Read : onePlus 6T ఇండియా ధర రూ. 37,999, నవంబర్ 1 నుంచి అమ్మకాలు, లాంచ్ ఆఫర్స్ ఇవే 

ఐఫోన్ ఎక్స్ తరహాలో ఫేస్ ఐడీ టెక్నాలజీని ఆపిల్ ఈ డివైస్‌లో ఇంప్లిమెంట్ చేసింది. ఆపిల్ సరికొత్త A12X బయోనిక్ చిప్ పై డివైస్ రన్ అవుతుంది. స్టోరేజ్ విషయానికి వచ్చేసరిక 1 టెరా బైట్ వరకు ఫ్లాష్ స్టోరేజ్ అందుబాటులో ఉంటుంది. ఐప్యాడ్ వెనుక భాగంలో ఎక్విప్ చేసిన 12 మెగా పిక్సల్ కెమెరా ద్వారా 4కే క్వాలిటీ వీడియోలను 60 ఫ్రేమ్స్ ఫర్ సెకున్‌తో రికార్డ్ చేసుకోవచ్చు. ఈ లేటెస్ట్ ఐప్యాడ్ మోడల్‌లో ఎక్విప్ చేసిన 4 సెట్ల స్పీకర్స్ స్టిరియో క్వాలిటీ సౌండ్‌ను డెలివరీ చేస్తాయి.  కలర్ వేరియంట్స్ విషయానికి వచ్చేసరికి సిల్వర్ ఇంకా స్పేస్ గ్రే వేరియంట్‌లలో ఈ కొత్త ఐప్యాడ్ అందుబాటులో ఉంటుంది.

ఇండియన్ మార్కెట్లో iPad Pro 2018 ధరలు ఈ విధంగా ఉంటాయి. .

11 ఇంచ్ 64జీబి వై-ఫై ఓన్లీ వేరియంట్ ధర రూ.71,900. 12.9 ఇంచ్ 64జీబి వై-ఫై ఓన్లీ వేరియంట్ ధర రూ.89,900. 11 ఇంచ్ 1 టెరాబైట్ వై-ఫై + సెల్యులార్ వేరియంట్ ధర రూ.1,53,900. 12.9 ఇంచ్ 1 టెరాబైట్ వై-ఫై + సెల్యులార్ వేరియంట్ ధర రూ.1,71,900. ఐప్యాడ్ ప్రో  2018కు సంబంధించి సెకండ్ జనరేషన్ పెన్సిల్ తో పాటు స్మార్ట్ కీబోర్డ్ ఫోలియోను ఆపిల్ లాంచ్ చేసింది. వాటిలో మొదటిదైన యాపిల్ పెన్సిల్ ధర రూ.10,990. రెండవదైన స్మార్ట్ కీబోర్డ్ ఫోలియో ధర రూ.15,900.

Also Read : ఇక Jio నెట్‌వర్క్‌లో పోర్న్ వీడియోలు ఓపెన్ అవ్వవు…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.