About

నేటి ఆధునిక కమ్యూనికేషన్ ప్రపంచం పూర్తిగా టెక్నాలజీ పై ఆధారపడి జీవిస్తోంది. టెక్నాలజీతో సహవాసం చేస్తోన్న సగటు మనిషి ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్రపోయేంత వరకు చేస్తోన్న చాలా వరకు పనులు ఇంటర్నెట్, యాప్స్ ఇంకా స్మార్ట్‌ఫోన్‌ల‌తోనే ముడిపడి ఉంటున్నాయి.

టెక్నాలజీ వార్తలను ఆదరిస్తోన్న తెలుగు పాఠకుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోన్న నేపథ్యంలో, మాఈ ‘Gadgetstelugu’ న్యూస్ వెబ్‌సైట్ ఇంటర్నెట్ ప్రపంచంలోకి అడుగుపెట్టడం జరిగింది. ఓ మంచి ఉద్దేశ్యంతో ప్రారంభించబడిన ఈ వెబ్‌సైట్ ద్వారా టెక్నాలజీ ప్రపంచంలో చోటుచేసుకుంటోన్న కొత్త ఆవిష్కరణలను అప్‌డేట్‌ల రూపంలో ఎప్పటికప్పుడు తెలుసుకునే వీలుంటుంది. వీటితో పాటు ఆయా గాడ్జెట్స్ ఇంకా సాఫ్ట్‌వేర్‌లకు సంబంధించి ప్రివ్యూస్, రివ్యూస్, ఫీచర్స్ అలానే టిప్స్ అండ్ ట్రిక్స్‌ను అర్థవంతమైన రీతిలో మన మాతృభాషలో మీకందించటం జరుగుతుంది.


Related Links: Contact GadgetsTelugu | GadgetsTelugu Team |

Our Other Publications: PUNAG | GizmoZeal

PUNAG MEDIA GROUP